Annamayya Songs
From BharatWiki
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య) (1408-1503), the mystic saint composer of the 15th century is the earliest known musician of South India to compose songs called “sankeertanas” in praise of Lord Venkateswara, the deity of Seven Hills in Tirumala, India. He is widely regarded as the Telugu pada kavita pitaamaha (Grand sire of telugu word poetry).
Given below are some of his song lyrics in telugu script. Follow the links below these songs to see more songs.
Songs of Annamacharya in telugu
1. అలమేలుమంగనీ వభినవరూపము (వాల్యూం 12-159)
అలమేలుమంగనీ వభినవరూపము జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ
గరుడాచలాధీశు ఘనవక్షముననుండి పరమానంద సంభిరతవై నెరతనములు జూపి నిరంతరమునాథుని హరుషింపగ జేసి తిగదమ్మ
శశికిరణములకు చలువలచూపులు విశదముగా మీద వెదజల్లుచు రసికత పెంపున కరగించి ఎప్పుడు నీ వశముజేసుకొంటి వల్లభునోయమ్మ
రట్టడి శ్రీవేంకటరాయనికి నీవు పట్టపురాణివై పరగుచు వట్టిమాకులిగిరించు వలపుమాటలవిభు జట్టిగొని వురమునసతమైతివమ్మ
2. వలదననొరులకు (వాల్యూం 4-17)
వలదననొరులకు వశమటవే తలచినట్లనిది దైవమెచేసె
తరుణికుచములను తామరమొగుడలు విరిసేనోయని వెరపునను సరగునపతినఖ చంద్రశకలములు దరులుగలుగనిది దైవమెచేసె
పొలతివదనమను పున్నమచంద్రుడు బలిమినెగయునని భయమునను మెలుతచికురధ మ్మిల్లపురాహువు తలచెదరగనిది దైవమెచేసె
వనితకువాడునొ వలపుతాపమున తనులతికయనుచు తమకమున ఘనవేంకటపతి కౌగిటచమటల తనివి దీర్చనిది దైవమె చేసె
3. పురుషోత్తముడవీవు (వాల్యూం 2-53)
పురుషోత్తముడవీవు పురుషాధముడనేను ధరలోననాయందు మంచితనమేది
అనంతాపరాధములు అటునేముసేసివి అనంతమైనదయ అది నీది నినునెఱగకుండేటి నీచ గుణము నాది ననునెడయకుండేటి గుణము నీది
సకలయాచకమే సరుసనాకుపని సకలరక్షకత్వము సరి నీపని ప్రకటించినిన్ను దూరేపలుకేనా కెప్పుడూను వెకలివైనను గాచేవిధమునీది
నేరమింతయు నాది నేరుపింతయు నీది సారెకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు యీరీతి వేంకటేశయిట్టేనను నేలితివి ధారుణిలో నిండెను ప్రతాపమునీది
4. భక్తికొలది వాడే (వాల్యూం 1-410)
భక్తికొలది వాడే పరమాత్ముడు భుక్తిముక్తి తానెయిచ్చు భువి పరమాత్ముడు
పట్టినవారిచే బిడ్డ పరమాత్ముడు బట్టబయటి ధనము పరమాత్ముడు పట్టపగటి వెలుగు పరమాత్ముడు యెట్టనెదుటనే వున్నాడిదె పరమాత్ముడు
పచ్చిపాలలోనివెన్న పరమాత్ముడు బచ్చనవాసినరూపు పరమాత్ముడు బచ్చుచేతివొరగల్లు పరమాత్ముడు యిచ్చుకొలదివాడువో యీ పరమాత్ముడు
పలుకులలోనితేట పరమాత్ముడు ఫలియించునిందరికి పరమాత్ముడు బలిమిశ్రీ వేంకటాద్రి పరమాత్ముడు యెలమి జీవులప్రాణమీ పరమాత్ముడు
5. ఏమొకో చిగురుటధరమున (వాల్యూం 12-82)
ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా
పడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెద వెలుపల కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు వెడలగవేసవికాలపు వెన్నెలకాదుకదా
ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు గద్దరి తిరువేంకటపతి కొగిటియధరామృతముల అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా
6. తెలిసిన వారికి దేవుండితడే (వాల్యూం 3-480)
తెలిసిన వారికి దేవుండితడే వలవని దుష్టుల వాదములేల
పురుషులలోపల పురుషోత్తముడు నరులలోన నరనారాయణుడు పరదైవములకు పరమేశ్వరుడు వరుసమూఢుల కెవ్వరోయితడు
పలుబ్రహ్మలకును పరబ్రహ్మము మలయునీశులకు మహేశుడితడు ఇలనాత్మలలో నిటుపరమాత్ముడు ఖలులకెట్లుండునో కానము యితడు
వేదంబులలో వేదాంతవేద్యుడు సోదించకరిగాచుచో నాదిమూలము యీదెస శ్రీ వేంకటేశుడిందరికి గాదిలి మతులను గైకొనడితడు
7. కొలిచిన వారల (వాల్యూం 3-419)
కొలిచిన వారల కొంగుపైడితడు బలిమి తారక బ్రహ్మమీతడు
యినవంశాంబుధి నెగసిన తేజము ఘన యజ్ఞంబుల గల ఫలము మనుజరూపమున మనియెడి బ్రహ్మము నినుపుల రఘుకుల నిథానమితడు
పరమాన్నములోపలి సారపుజవి పరగినదివిజుల భయహరము మరిగినసీతా మంగళ సూత్రము ధరలో రామావతారంబితడు
చకితదానవుల సంహారచక్రము సకలవన చరుల జయకరము వికసితమగు శ్రీవేంకట నిలయము ప్రకటిత దశరథ భాగ్యంబితడు
8. అంతరంగమెల్ల (వాల్యూం 1-437)
అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటె వింతవింత విధముల వీడునా బంధములు
మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా పనిమాలి ముదిసితే పాసెనా భవము
చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా యెదుట తాను రాజైతే ఏలేనాపరము
పావనుడై ఫలమేది భక్తి కలిగిన దాకా జీవించి ఫలమేది చింత దీరుదాకా వేవేల ఫలమేది వేంకటేశుగన్నదాక భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా
9. భక్తినీపై దొకటె పరమసుఖము (వాల్యూం 3-322)
భక్తినీపై దొకటె పరమసుఖము యుక్తిజూచిన నిజం బొక్కటేలేదు
కులమెంత గలిగెనది కూడించు గర్వంబు చలమెంత గలిగెనది జగడమే రేచు తలపెంత పెంచినా తగిలించు కోరికలు యెలమి విజ్ఞానంబు యేమిటాలేదు
ధనమెంత గలిగెనది దట్టమౌలోభంబు మొనయు చక్కదనంబు మోహములు రేచు ఘనవిద్య గలిగినను కప్పు పై పై మదము యెనయగ పరమ పద మించుకయులేదు
తరుణులెందరు అయిన తాపములు సమకూడు సిరులెన్ని గలిగినను చింతలేపెరుగు యిరవయిన శ్రీవేంకటేశు నినుకొలువగా పెరిగె నానందంబు బెళకులికలేవు
10. విశ్వరూపమిదివో (వాల్యూం 3-409)
విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో శాశ్వతులమైతిమింక జయము నాజన్మము
కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల పండిన వృక్షములే కల్పతరువులు నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము
మేడవంటి హరిరూపు మించైనపైడి గోపుర మాడనే వాలిన పక్షుల మరులు వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము యీడమాకు పొడచూపె ఇహమేపోపరము
కోటిమదనులవంటి గుడిలో చక్కని మూర్తి యీటులేని శ్రీ వేంకటేశుడితడు వాటపు సొమ్ములు ముద్ర వక్షపుటలమేల్మంగ కూటువైనన్నేలితి యెక్కువనోనాతాపము
Songs in Telugu Script
- Annamayya Songs (Songs 1 to 10)
- Annamayya Songs 2 (Songs 11 to 20)
- Annamayya Songs 3 (Songs 21 to 30)
- Annamayya Songs 4 (Songs 31 to 40)
- Annamayya Songs 5 (Songs 41 to 50)
- Annamayya Songs 6 (Songs 51 to 60)
- Annamayya Songs 7 (Songs 61 to 70)
- Annamayya Songs 8 (Songs 71 to 80)
- Annamayya Songs 9 (Songs 81 to 90)

